- Advertisement -

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ..ఓటీటీ డేట్ లాక్!

- Advertisement -

ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అప్పటివరకు విజయాల పరంపరలో ఉన్న ప్రదీప్‌కు ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం మే 15, 2026 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, అన్ని ప్రధాన భాషల్లోనూ ఒకేసారి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

నయనతార, ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఎస్.జె. సూర్య మరియు యోగి బాబు కీలక పాత్రలు పోషించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -