అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖిల్ అక్కినేని తదుపరి చిత్రం ‘లెనిన్’ (Lenin) గురించి కింగ్ నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. అఖిల్ కెరీర్‌లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ సినిమా విడుదల గురించి వస్తున్న పుకార్లపై నాగార్జున స్పందిస్తూ, సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయని పునరుద్ఘాటించారు. అఖిల్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. సినిమాకు సంబంధించి ‘ఫస్ట్ కట్’ (తొలి వెర్షన్) చూశాను. అది చూశాక నాకు ఒకటే అనిపించింది.. ఈ సినిమా తర్వాత ప్రేక్షకులు ఒక సరికొత్త అఖిల్‌ను చూస్తారు. ఆయన నటన, బాడీ లాంగ్వేజ్ గత సినిమాల కంటే భిన్నంగా ఉన్నాయి అని నాగ్ ప్రశంసించారు.
అనిల్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. అఖిల్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సినిమా ఆలస్యమవుతున్నా, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని, అక్కినేని అభిమానులు గర్వపడేలా ‘లెనిన్’ ఉంటుందని నాగార్జున ప్రామిస్ చేశారు.
‘ఏజెంట్’ తర్వాత అఖిల్ చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
