తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని మలుపు చోటుచేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి మిత్రపక్షాల మద్దతు లభించడంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు మార్గం సుగమమైంది. దశాబ్దాల ద్రవిడ రాజకీయాలకు స్వస్తి పలికి, ప్రజలు విజయ్‌కు పట్టం కట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టడంలో విజయ్ సక్సెస్ అయినట్లు సమాచారం. ఇందుకు VCK (విదుతలై చిరుతైగల్ కట్చి,వామపక్షాలు (CPM & CPI) సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ పార్టీల మద్దతుతో టీవీకే కూటమి మేజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటే అవకాశం ఉంది. దీంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది.
తమిళనాడులో చోటుచేసుకున్న ఈ పరిణామాలు జాతీయ స్థాయిలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక సినీ నటుడు రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అధికార పీఠాన్ని దక్కించుకోవడంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
