మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్లో విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై ఉన్న భారీ అంచనాలను వందకు వంద శాతం అందుకుంది.
విజయనగరం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే సాధారణ కార్మికుడిగా కనిపిస్తారు. అతనికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అయితే, కొన్ని ఊహించని పరిస్థితుల కారణంగా అతను తనకు ఏమాత్రం పరిచయం లేని కుస్తీ (రెజ్లింగ్) రంగంలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత అతను ఒక క్రాస్ఓవర్ అథ్లెట్‌గా ఎలా మారాడనేదే ఈ సినిమా కథ.
‘పెద్ది’ ప్రపంచం, విజువల్స్, పాత్రల డిజైన్ మరియు రోమాలు నిక్కబొడిచే యాక్షన్ సీన్లు అన్నీ కలిపి ట్రైలర్లోఓ రేంజ్లో తీశారు. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, మరియు బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న మొదటి చిత్రమిది.ఈ భారీ బడ్జెట్ వినోదాత్మక చిత్రం జూన్ 4, 2026 న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
