- Advertisement -

మందులు లేకుండా ఫ్యాటీ లివర్‌ తగ్గించవచ్చా?

- Advertisement -

జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ (కాలేయంలో కొవ్వు చేరడం) వ్యాధిని సహజంగానే నయం చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. చక్కెరను తగ్గించడం, నిద్రను మెరుగుపరుచుకోవడం, రోజూ నడవడం వంటి చిన్నచిన్న రోజువారీ మార్పులు కాలేయ ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఊబకాయం, రోజంతా కూర్చుని పనిచేసే సంస్కృతి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉన్నవారిలో ఫ్యాటీ లివర్ అనేది అత్యంత సాధారణ సమస్యగా మారుతోంది. చాలామందికి ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ, సాధారణ స్కానింగ్ లేదా హెల్త్ చెకప్స్ చేయించుకున్నప్పుడు ఇది అనుకోకుండా బయటపడుతోందని నిపుణులు అంటున్నారు.

అల్ట్రాసౌండ్ రిపోర్టులో ఫ్యాటీ లివర్ అని రాగానే చాలామంది వెంటనే మందుల కోసం వెతుకుతుంటారు. అయితే ప్రారంభ దశలో జీవనశైలిని మార్చుకోవడమే దీనికి అత్యంత ప్రభావవంతమైన పరిష్కారం. గంటల తరబడి కూర్చోవడం, ప్యాక్ చేసిన ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర పానీయాలు, లేట్ నైట్ డిన్నర్స్, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ‘నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్’ రావడానికి ప్రధాన కారణాలు.

అయితే, ఇందులో ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. ప్రారంభ దశలో ఉన్న ఫ్యాటీ లివర్‌ను క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ద్వారా సహజంగానే రివర్స్ చేయవచ్చు. ఫ్యాటీ లివర్ కేసులు పెరగడానికి మితిమీరిన చక్కెర వినియోగం ఒక పెద్ద కారణం. కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, బిస్కెట్లు, స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయంపై భారం పడుతుంది. ఇది తర్వాత కొవ్వుగా మారుతుంది. కేవలం రోజువారీ డైట్ నుండి చక్కెరను తగ్గించడం ద్వారానే లివర్ ఎంజైమ్‌లలో మంచి మార్పు కనిపిస్తుంది.

లివర్ కోలుకోవడానికి ఖరీదైన ఫిట్‌నెస్ జిమ్‌లు అవసరం లేదు. వారానికి ఆరు రోజులు… రోజుకు 30 నిమిషాల పాటు వేగంగా నడవడం సరిపోతుంది. దీంతో పాటు యోగా, స్క్వాట్స్, పుష్-అప్స్ వంటి సాధారణ స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామాలు చేయాలి. ఎందుకంటే కండరాలు గ్లూకోజ్‌ను నియంత్రించడంలో సహాయపడి, కాలేయంపై ఒత్తిడిని తగ్గిస్తాయి.

సరిగ్గా నిద్రపోకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల కార్టిసాల్, ఇన్సులిన్ వంటి హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది పరోక్షంగా కొవ్వు పేరుకుపోవడానికి, లివర్ వాపునకు కారణమవుతుంది. రాత్రి పూట కనీసం 6 నుండి 7 గంటల నిద్ర తప్పనిసరి. పడుకునే ముందు మొబైల్ స్క్రీన్లు చూడటం తగ్గించాలి.

క్రమంగా బరువు తగ్గడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య చాలావరకు తగ్గుతుంది. శరీర బరువులో 7-10% తగ్గడం వల్ల కాలేయంలోని కొవ్వు, వాపు తగ్గుతాయి. అయితే క్రాష్ డైట్స్ (ఒక్కసారిగా బరువు తగ్గడం) చేయడం వల్ల లివర్‌పై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ప్యాక్ చేసిన, నూనెలో బాగా వేయించిన ఆహారాలను తగ్గించి.. కూరగాయలు, పండ్లు, గుడ్లు, చేపలు, తృణధాన్యాలతో భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -