- Advertisement -

మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ కీలక నిర్ణయం!

- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మహిళా క్రికెటర్ల కోసం రిటర్న్ టు ప్లే పోస్ట్-ప్రెగ్నెన్సీ గైడ్‌లైన్స్ ను విడుదల చేసింది. మహిళా ఆటగాళ్లు గర్భధారణ, ప్రసవం మరియు ఆ తర్వాత తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టే ప్రక్రియలో వారికి అవసరమైన పూర్తి మద్దతును అందించడానికి సభ్య దేశాల క్రికెట్ బోర్డులకు ఐసీసీ ఒక సమగ్రమైన నిబంధనల పట్టికను రూపొందించింది.

ఈ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి మహిళా ఆటగాడి కోసం ఒక ప్రత్యేక ‘కేస్ మేనేజర్’ను నియమించాలని వారికి అనుకూలమైన శిక్షణ వాతావరణాన్ని కల్పించాలని, పిల్లల సంరక్షణ (చైల్డ్‌కేర్) మరియు ప్రయాణ సౌకర్యాలను అందించాలని ఐసీసీ సూచించింది. అలాగే గర్భధారణ సమయంలో ప్రసవం తర్వాత వారికి అవసరమైన వైద్య మరియు మానసిక ఆరోగ్య సేవలను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. మహిళా క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ప్రొఫెషనల్‌గా మారుతున్న తరుణంలో కెరీర్ మధ్యలోనే కుటుంబ జీవితాన్ని ప్రారంభించాలనుకునే ఆటగాళ్ల సంఖ్య పెరుగుతుండటంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఐసీసీ మెడికల్ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా మహిళా జట్టు డాక్టర్ ఫిలిప్పా ఇంజ్ నేతృత్వంలో ఈ మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. సభ్య దేశాల క్రికెట్ బోర్డులు తమ స్థానిక చట్టాలకు అనుగుణంగా ఆటగాళ్ల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ స్వంత ప్రెగ్నెన్సీ పాలసీలను తయారు చేసుకోవడానికి ఇవి సహాయపడతాయి.ఈ కొత్త నిబంధనలలో ప్రధానంగా ఆరు అంచెల విధానాన్ని ప్రతిపాదించారు.

()ప్రత్యేక కేస్ మేనేజర్…గర్భధారణ సమయం నుండి తిరిగి మైదానంలోకి వచ్చే వరకు ఆటగాళ్లకు అండగా ఉండేందుకు ఒక డాక్టర్ లేదా ఫిజియోథెరపిస్ట్‌ను కేస్ మేనేజర్‌గా నియమించాలి. వీరు తల్లి, బిడ్డ సంక్షేమాన్ని పర్యవేక్షిస్తూ బోర్డుకు, ఆటగాడికి మధ్య వారధిగా ఉంటారు.

()రెగ్యులర్ మేనేజ్‌మెంట్ సమావేశాలు: ఆటగాళ్లు తమ గర్భధారణను ప్రకటించినప్పుడు, ప్రెగ్నెన్సీ మూడవ త్రైమాసికంలో (3rd trimester), ప్రసవం జరిగిన 6 నుండి 8 వారాల తర్వాత మరియు తిరిగి జట్టులోకి వచ్చేటప్పుడు ప్రతి 4 వారాల విరామంలో ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించాలి.

()మల్టీడిసిప్లినరీ సపోర్ట్ టీమ్: మెడికల్ స్టాఫ్, ఫిజియోలు, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌లు, సైకాలజిస్ట్‌లు, డైటీషియన్లు మరియు కుటుంబ సభ్యులతో కూడిన ఒక బృందం ఆటగాడికి నిరంతరం మద్దతుగా ఉండాలి.

()స్వయం నిర్ణయాధికారం: గర్భధారణ విషయాన్ని ఎప్పుడు ప్రకటించాలనేది పూర్తిగా సదరు ఆటగాడి ఇష్టానికే వదిలేయాలి. బోర్డులు బలవంతంగా ప్రెగ్నెన్సీ పరీక్షలు నిర్వహించకూడదు. గర్భధారణ సమయంలో వ్యాయామాలను ప్రోత్సహించినప్పటికీ, పోటీలలో పాల్గొనే అంశంపై వైద్యుల సలహా మేరకే నిర్ణయం తీసుకోవాలి. మొదటి త్రైమాసికం (తొలి మూడు నెలలు) తర్వాత పోటీలకు దూరంగా ఉండాలని సూచించినప్పటికీ, దీనికి ఎటువంటి ఖచ్చితమైన కాలపరిమితి లేదు.

ఈ పాలసీ గురించి డాక్టర్ ఫిలిప్పా ఇంజ్ మాట్లాడుతూ….మహిళా క్రికెటర్లకు బిడ్డ పుట్టడం అనేది వారి కెరీర్‌కు ముగింపు కాకూడదనేదే మా ఉద్దేశం. గతంలో చాలా బోర్డులకు ఇలాంటి నిబంధనలు లేవు, కాబట్టి ప్రతి దేశం తమకు అనుకూలంగా మార్చుకునేలా ఈ లేఅవుట్‌ను సిద్ధం చేశాం. ఒక అథ్లెట్ ప్రసవం తర్వాత తిరిగి రావడానికి వారి కుటుంబ అవసరాలకు తగినట్లుగా వ్యక్తిగత మద్దతు అవసరం అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -