- Advertisement -

ఫుల్ జోష్‌లో చిరంజీవి ‘మెగా 158

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మెగా 158’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే పొల్లాచ్చి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న చిత్రబృందం, సోమవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టింది.

హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ తాజా షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా, కీలకమైన టాకీ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల పొల్లాచ్చి షెడ్యూల్ ముగింపు సందర్భంగా చిత్రబృందం ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో యాక్షన్ సన్నివేశాలు, షూటింగ్ విశేషాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పొల్లాచ్చి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు బాబీ పూర్తి చేశారు.

‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఒక పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో చిరంజీవి రెండు విభిన్న కోణాలున్న పాత్రల్లో కనిపిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం (సినిమాటోగ్రఫీ) చేస్తున్నారు. మెగాస్టార్ నుంచి వస్తున్న ఈ మాస్ యాక్షన్ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -