- Advertisement -

‘రాపో 23’ గ్రాండ్ లాంచ్‌కు సిద్ధం..

- Advertisement -

హీరో రామ్ పోతినేని (RAPO) తన కొత్త చిత్రం ‘రాపో 23’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రానికి గేయరచయితగా మారిన రామ్, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలను కూడా స్వయంగా చేపడుతున్నారు.

చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం, ‘రాపో 23’ చిత్రాన్ని రేపు ఘనంగా ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.

ఈ చిత్రంలో రామ్ ఒకేసారి హీరో, దర్శకుడు, రచయితగా పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తుండటంతో సినిమాపై సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.ఈ చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ పోతినేని నూతనంగా ప్రారంభించిన ‘రాపో సినిమాటిక్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

సినిమాలో రామ్ ‘వీర’ అనే పవర్‌ఫుల్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరు ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తుండగా, ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -