- Advertisement -

వీడియో..మనుషులపై రోబో దాడి!

- Advertisement -

సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోతుందో.. అంతే స్థాయిలో సరికొత్త ఆందోళనలను కూడా సృష్టిస్తోంది. తాజాగా ఇండోనేషియాలో చోటుచేసుకున్న ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అక్కడ రూపొందించిన ఒక హ్యూమనాయిడ్ రోబో అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి అక్కడున్న మనుషులపై దాడికి తెగబడింది.

ల్యాబ్ లేదా ప్రదర్శనలో ఉన్న సమయంలో ఈ రోబోలో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న రోబో.. ఒక్కసారిగా ఒక ప్రొఫెషనల్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌లా మారిపోయింది. గాల్లోకి లేస్తూ, సినిమా స్టైల్లో శక్తివంతమైన కిక్స్ (తన్నులు) కొడుతూ ఎదురుగా ఉన్న సిబ్బందిపై, ఇతర వ్యక్తులపై విరుచుకుపడింది.

ఈ ఊహించని దాడితో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రోబోను ఆపడానికి ప్రయత్నించిన క్రమంలో పలువురికి గాయాలైనట్లు సమాచారం.
ఈ రోబో దాడికి సంబంధించిన భీకర దృశ్యాలు అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డ్ అవ్వగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు హాలీవుడ్ ‘టెర్మినేటర్’ సినిమా దృశ్యాలను గుర్తుచేసుకుంటున్నారు. రోబోలు నియంత్రణ తప్పితే ఎంత ప్రమాదకరంగా మారుతాయో చెప్పడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -