- Advertisement -

మీడియా ప్రచారంపై “ప్రశ్న రావణ్ భార్య” ఆగ్రహం

- Advertisement -

సోషల్ మీడియా యాక్టివిస్ట్ “ప్రశ్న రావణ్” లక్ష్యంగా జరుగుతున్న ప్రచారంపై ఆయన భార్య తీవ్రంగా స్పందించారు. తన భర్తపై కొందరు కావాలనే కులం, మతం రంగు పులుముతూ విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ ప్రచారాలన్నింటినీ తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

తన భర్తకు వ్యతిరేకంగా సర్కులేట్ అవుతున్న వీడియోపై ఆమె స్పష్టతనిచ్చారు. “నా భర్తపై జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నది ఒక కల్పిత వీడియో. తమ తప్పులను సమర్థించుకునేందుకు, లేని వీడియోను సృష్టించి ఈ రకమైన తప్పుడు ప్రచారానికి దిగారు. ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రజలెవరూ విశ్వసించవద్దు, నమ్మవద్దు,” అని ఆమె కోరారు.

తమ కుటుంబం కులాలకు, మతాల పేరిట జరిగే విద్వేషాలకు పూర్తిగా వ్యతిరేకమని ఆమె స్పష్టం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే తాను మాట్లాడుతున్నట్లు తెలిపిన ఆమె, తన భర్త వ్యక్తిగత వివరాలను వెల్లడించారు. “నా భర్తది కమ్మ కులం. ఆయన అధికారిక పేరు కూడా ‘రావణ్’ అనే ఉంటుంది. రావణ్ పలానా పార్టీకి చెందినవాడని, పలానా వర్గానికి చెందినవాడంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. మాకు ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధాలు లేవు. సమాజంలో గొంతులేని వర్గాలకు ఒక గొంతుకై నిలబడటమే రావణ్ సిద్ధాంతం. అదే ఆయన పార్టీ.. అదే ఆయన వర్గం,” అని ఆమె స్పష్టం చేశారు.

రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తిపై, వారి కుటుంబంపై ఇలాంటి కల్పిత ఆరోపణలు చేయడం సరికాదని ఆమె హితవు పలికారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -