- Advertisement -

‘జననాయగన్’ విడుద‌ల ఎప్పుడంటే?

- Advertisement -

విజయ్ నటించిన తాజా చిత్రం ‘జననాయగన్’ విడుదల గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ అలాగే విడుదల తేదీపై వస్తున్న వార్తలపై నటి ప్రియమణి తాజాగా స్పందించారు. ఒక ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె, ఈ చిత్రం విడుదలపై కీలక సంకేతాలు ఇచ్చారు.

సినిమా విడుదల తేదీ గురించి ఇంకా కచ్చితమైన సమాచారం తనకు తెలియదని ప్రియమణి పేర్కొన్నారు. అయితే త్వరలోనే చిత్రబృందం దీనిపై అధికారిక ప్రకటన చేస్తుందని ఆమె వెల్లడించారు. జులై నెలాఖరులోనే ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని ఆమె హింట్ ఇవ్వడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. మరోవైపు ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చిందని, జులై 23న సినిమా విడుదలవుతుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియమణి వ్యాఖ్యలు కూడా దాదాపు ఇదే తేదీని సూచిస్తుండటంతో, త్వరలోనే విడుదల ఖాయమని భావిస్తున్నారు.

సినిమాతో పాటు విజయ్ రాజకీయ ప్రస్థానంపై కూడా ప్రియమణి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. విజయ్ ప్రజలకు సేవ చేయడానికే పుట్టారని ఆమె అభిప్రాయపడ్డారు. ఆయన ప్రస్తుతం అద్భుతంగా పని చేస్తున్నారని, ఇదే బాటలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు. విజయ్ పుట్టుకతోనే నాయకుడని ఆమె ప్రశంసించారు.

విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో ‘జననాయగన్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం, అనుకోని కారణాల వల్ల వాయిదా పడటంతో అభిమానులు నిరాశ చెందారు. ఇప్పటికీ చిత్రబృందం నుంచి అధికారిక సమాచారం వెలువడకపోయినా, ప్రియమణి చేసిన వ్యాఖ్యలతో ఈ సినిమాపై మళ్ళీ చర్చ మొదలైంది. జులై 23న విడుదలయ్యే అవకాశాలపై అధికారిక ప్రకటన కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -