- Advertisement -

పీరియడ్స్‌ విషయంలోనూ అలా చేశాడు!

- Advertisement -

చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సుమారు రెండేళ్ల పాటు తాను ఒకరితో రిలేషన్‌లో ఉన్నానని, ఆ బంధం తనను మానసికంగా ఎంతగానో కుంగదీసిందని తెలిపారు. మాజీ ప్రియుడి ప్రవర్తన వల్ల ఒక నటిగా, మహిళగా తనను తాను నిందించుకునే దారుణమైన పరిస్థితికి వచ్చానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన రెండో భాగం తాజాగా విడుదలైంది. అందులో అనుపమ మాట్లాడుతూ.. తాను ఓ నటినైనందుకు, ధైర్యంగా ఉన్నందుకు, ప్రతి నెలా పీరియడ్స్ వచ్చే ఒక సాధారణ మహిళనైనందుకు తనను తాను సిగ్గుపడేలా చేశాడని వాపోయారు. తాను ఏ రోజు వెళ్లి తన తప్పులను ప్రశ్నించినా.. ఎదుటి వ్యక్తి చాలా చులకనగా మాట్లాడేవాడని తెలిపారు. ‘ఓహో.. నీకు పీరియడ్స్‌ సమయమా.. ఇంకా రాలేదా.. నీవిగో మూడ్‌ స్వింగ్స్‌ కదా’ అంటూ తనను మానసికంగా ఎంతో వేధించాడని గుర్తుచేసుకున్నారు. ఆ మాటలతో తనపై నాకే తీవ్రమైన అసహ్యం వేసిందని కన్నీటి పర్యంతమయ్యారు.

ఒకప్పుడు తనకు భవిష్యత్తులో 11 మంది పిల్లలు ఉండాలని అందమైన కలలు కనేదాన్ని అని అనుపమ చెప్పారు. కానీ ఆ వ్యక్తి వల్ల కలిగిన క్షోభతో, అసలు తనకు పిల్లలే వద్దు అనే స్థాయికి మానసికంగా దిగజారిపోయానని తెలిపారు. కేవలం ఒక మహిళగా పుట్టినందుకే కదా ఇలాంటి అవమానకరమైన మాటలు పడాల్సి వస్తోందని తీవ్రంగా మధనపడ్డానని చెప్పారు. ఆ బంధం కారణంగా తాను తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు తెలిపారు.

షూటింగ్ సెట్స్‌లో అందరితో నవ్వుతూ కనిపించినా, లోపల మాత్రం ఎంతో కుంగిపోయేదాన్నని అనుపమ చెప్పారు. షూటింగ్ సమయంలో క్యారవాన్‌లోకి వెళ్లి ఒంటరిగా గంటల తరబడి ఏడ్చేదానినని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మానసిక వేధింపులు ఏ స్థాయికి వెళ్లాయంటే, చివరికి తన సొంత తమ్ముడితో ఆప్యాయంగా చనువుగా ఉండడానికి కూడా తాను భయపడే పరిస్థితి వచ్చిందని వాపోయారు. అయితే ఆ మాజీ బాయ్‌ఫ్రెండ్ ఎవరనేది మాత్రం ఆమె పేరు చెప్పలేదు. అయినప్పటికీ గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫొటోల ఆధారంగా నెటిజన్లు రకరకాల పేర్లను ప్రచారం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -