- Advertisement -

కన్న కూతురులా చూడాల్సిన బాబాయే.. హత్య చేసి..

- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో అత్యంత అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన పాపానికి కన్న కూతురులా చూడాల్సిన బంధువే కామాంధుడిగా మారి బాలిక ప్రాణం తీశాడు. ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

బరేలీలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక, పక్కింటి యువకుడిని ప్రేమిస్తోందని తెలుసుకున్న ఆమె బాబాయ్ జయప్రకాశ్ ఆమెను తీవ్రంగా మందలించాడు. ఆ అబ్బాయికి దూరంగా ఉండాలని గట్టిగా హెచ్చరించినా, ఆ బాలిక రహస్యంగా ఫోన్‌లో మాట్లాడటం మాత్రం ఆపలేదు.

ఈ విషయంపై తీవ్ర కోపోద్రిక్తుడైన బాబాయ్ జయప్రకాశ్ ఆ బాలికను బలవంతంగా స్థానిక పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యంత కిరాతకంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమె కాళ్లకు ఏకంగా ఆరు ఇనుప మేకులు కొట్టి, సుమారు 8 అడుగుల లోతులో బాలిక మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా పాతిపెట్టాడు.

గత జూలై 28వ తేదీ నుంచి ఆ బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన ప్రియుడు, ఘటన జరిగిన 22 రోజుల తర్వాత పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా, కుటుంబ సభ్యులే ఈ అపరాధంలో ప్రమేయం ఉన్నట్లు అనుమానించారు.

ఈ క్రమంలో పోలీసులు తమదైన శైలిలో కుటుంబ సభ్యులను విచారించగా, బాలిక బాబాయ్ జయప్రకాశ్ అసలు నిజం ఒప్పుకున్నాడు. తానే స్వయంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అంగీకరించాడు. నిందితుడు జయప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -