టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన నటించబోయే మోస్ట్ అవేటెడ్ పాన్ వరల్డ్ మూవీ ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ (SSMB29) షూటింగ్ షెడ్యూల్ తాజాగా ముగిసింది. ఈ భారీ చిత్రం కోసం మహేష్ బాబు గత కొంతకాలంగా చాలా డిఫరెంట్‌గా, రఫ్ లుక్‌లో కనిపించారు. పెద్ద జుట్టు, గడ్సంతో పూర్తిగా మారిపోయిన ఆయన రూపం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
అయితే ఆ సినిమా షూటింగ్ పనులు ఒక కొలిక్కి రావడంతో మహేష్ బాబు తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశారు. ఆ గెటప్ నుంచి బయటకు వచ్చిన ఆయన, తాజాగా క్లీన్ షేవ్ లుక్‌లోకి మారారు. చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ క్లీన్ అండ్ హ్యాండ్సమ్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రీసెంట్ ఫోటోల్లో ఆయన చాలా స్టైలిష్‌గా, యంగ్‌గా కనిపిస్తున్నారు. ఈ కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. గ్లోబల్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. విదేశీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా శ్రమించారు. ఈ మూవీకి సంబంధించిన తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ కొత్త లుక్‌లో మహేష్ బాబు మరింత గ్లామరస్‌గా కనిపించడంతో, సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

