ప్రియుడి కోసం బీహార్‌కు వచ్చిన రష్యన్ యువతి!

సినిమా స్టోరీని తలపించేలా ఒక రియల్ లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఉపాధి కోసం రష్యా వెళ్లిన ఒక సింపుల్ బీహార్ కుర్రాడిని, విదేశీ వనిత పిచ్చిగా ప్రేమించింది. ప్రేమ కోసం తన ఫ్యామిలీతో సహా ఇండియాకి వచ్చేసింది ఈ రష్యన్ బ్యూటీ.

బిహార్‌లోని భాగల్‌పూర్ జిల్లా రాజాపూర్ గ్రామానికి చెందిన రాహుల్ యాదవ్ జాబ్ కోసం రష్యా వెళ్ళాడు. అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్న టైమ్‌లో జూలియా (జులీ) అనే రష్యన్ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ ఫ్రెండ్‌షిప్ కాస్తా లవ్‌గా మారింది.

కొన్ని రోజుల తర్వాత రాహుల్ ఇండియాకి రిటర్న్ వచ్చేయాల్సి వచ్చింది. రాహుల్ లేని లైఫ్‌ను ఊహించుకోలేకపోయిన ఆ రష్యన్ గర్ల్.. హి ఈజ్ ది వన్ అనుకుని, పెళ్లి చేసుకునేందుకు తన ఫ్యామిలీతో కలిసి ఇండియాకి ఫ్లైటెక్కింది. నేరుగా బీహార్‌లోని రాహుల్ విలేజ్‌కి చేరుకుంది.

రాహుల్ ఫైనాన్షియల్ కండిషన్ అంతంతమాత్రమే అని, వారిది చాలా సింపుల్ హౌస్ అని తెలిసినప్పటికీ ఆమె అస్సలు వెనకడుగు వేయలేదు. రాహుల్ ఎక్కడ ఉంటే తన లైఫ్ అక్కడే అని డిసైడ్ అయిపోయింది. విదేశీ యువతి చూపించిన ట్రూ లవ్ చూసి ఇంప్రెస్ అయిన ఇద్దరి ఫ్యామిలీస్ పెద్దలు వీళ్ల మ్యారేజ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నవంబర్‌లో ఈ క్యూట్ కపుల్‌కి అట్టహాసంగా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బోర్డర్స్ దాటి వచ్చిన ఈ రియల్ లవ్ స్టోరీ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది!