ఈ మధ్య హీరోయిన్ తాప్సీ.. స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు పాటలపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఒక ఇంగ్లిష్ కామెడీ షోలో మాట్లాడిన తాప్సి.. ఝమ్మంది నాదం మూవీలోని ఓ పాట మీద జోకులేస్తూ.. రాఘవేంద్రరావు హీరోయిన్ల నడుము చూపించే విధానంగా కొన్ని జోకులు వేసింది. శ్రీదేవి.. జయప్రద లాంటి హీరోయిన్లపై పూలు, పళ్లు వేసిన రాఘవేంద్రరావు.. తనపై మాత్రం కొబ్బరికాయ వేసారని.. నడుముని కొబ్బరుకాయతో కొట్టడంతో ఎలాంటి శృంగారం దాగుందో తనకి అర్ధం కావడం లేదు అంటూ ముగించింది. దాంతో తాప్సి మీద సోషల్ మీడియాలో నేగేటివ్ పోస్టులు మొదలయ్యాయి. అవకాశాలు లేనప్పుడు ఒకలా మాట్లాడి, ఇప్పుడు బాలివుడ్ వెళ్ళగానే ఒకలా మాట్లాడుతోంది, మోసగత్తె అంటూ కామెంట్స్ పడ్డాయి. వీటిమీద స్పందించింది తాప్సి. “అసలు నేనేం అన్నాను అని. ఆయన అలాంటి పాటలకి ఫేమస్ కదా. నేను ఏదైతే ఉందొ, అదే చెప్పాను. నిజాన్ని కూడా అవమానకరంగా చూస్తే అది నా తప్పు కాదు. ఆ విడియో జనాలు చూసారు, రాఘవేంద్రరావు గారు కూడా చూసారు. ఆయన విడియో చూసి నవ్వుకున్నారట. ఆయనొక్కడే కాదు, ఆయన కుటుంబసభ్యులు కూడా నవ్వుకున్నారట. నేను వెళ్ళింది ఒక కామెడి షోకి. అక్కడ చేయాల్సింది కామెడియే కదా. ఆయనకి కనబడని అవమానం మిగితావారికి ఎలా కనబడిందో” అంటూ కోపగించుకున్నట్టే మాట్లాడింది తాప్సి.
- Advertisement -
తాప్సి వ్యాఖ్యాలకు రాఘవేంద్రరావు ఏమన్నారో తెలుసా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
