పవన్ బర్త్‌డే సాంగ్ లిరిక్స్ విడుదల

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ ఫ్యాన్స్‌కు వినోదాన్ని పంచి తనకు పవన్‌పై ఉన్న అభిమానాన్ని చూపెట్టడానికి సింగర్ బాబా సెహగల్ మరోసారి రెడీ అయిపోయాడు. దీనికి వేదికగా పవన్‌ కల్యాణ్ పుట్టిన రోజును చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

చాలా సార్లు స్టేజ్‌ల పైన పవన్‌పై పాట పాడినప్పటికి ఇప్పుడు అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో అభిమానుల కోసం పాడనున్నట్లు బాబా ట్విట్టర్‌లో వెల్లడించాడు. ఇందుకోసం ఈ వారంలో ఒక టీజర్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2న పాట మొత్తం రిలీజ్ చేస్తున్నట్లు బాబా సెహగల్ చెప్పారు. ఈ పాటకు సంబందించి పల్లవి కూడా బయట పెట్టేశాడు. ఈ పల్లవీతోనే తనకు పవన్‌పై ఉన్న అభిమానాన్ని చాటాడు. పవర్ స్టార్ కొత్త సాంగ్ కోసం స్మాల్ పల్లవి మీకోసం అంటూ ట్వీట్ చేశాడు సెహెగల్.

 “పేరులో పవనే..తీరుచూస్తే గన్నే..క్యారక్టర్ తూకమేస్తే ఆల్వేస్ నంబర్ వన్నే,” అంటూ పల్లవిని వినిపించాడు.