- Advertisement -
సూపర్ స్టార్ మహేశ్‌బాబు కోలివుడ్ సాంప్రదాయాన్ని టాలివుడ్లో కూడా స్టార్ట్ చేయబోతున్నాడు.
తాజాగా రిలిజైన శ్రీమంతుడు సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారిన మహేశ్‌బాబుకు ఆరంభంలోనే మంచి లాభాలు రావటంతో యూనిట్ సభ్యుల మొత్తానికి మంచి ట్రీట్ ఇవ్వబోతున్నాడట.
ట్రీట్‌తో పాటు అందరికి గిప్ట్స్ కూడా ఇవ్వనున్నాడట. ఈ నెలలోనే తన బర్త్‌డే కూడా ఉండటంతో అన్నీ కలిపి ఒక గ్రాండ్ పార్టీని శ్రీమంతుడు యూనిట్ సభ్యులకు అరేంజ్ చేస్తున్నాడని ఫిల్మ్ వర్గాల సమాచారం. సినిమా యూనిట్ సభ్యులకు గిప్ట్స్ ఇవ్వటం, ముందు నుంచే కోలివుడ్లో ఉన్నా, మహేశ్ ఈ సాంప్రదాయాన్ని శ్రీమంతుడు యూనిట్ సభ్యులతో టాలివుడ్లో కూడా స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.