శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాలో భానుమతి గా నటించిన సాయి పల్లవికి ప్రేమమ్ తో ఎలాంటి క్రేజ్ వచ్చిందో అంతకు మించిన క్రేజ్ ఈ సినిమాతో దక్కించుకుంది. ఈ నటనకు ప్రేక్షకులే కాదు.. సినీ ప్రముఖులు కూడా ఫిదా అయిపోయారు. ప్రస్తుతం నాని సినిమాతో పాటు.. శర్వానంద్ తో ఓ సినిమా చేస్తుంది ఈ భామ. అయితే సినిమాలే తన కెరియర్ కాదని డాక్టర్ గా సెటిల అవుతానై అంటోంది.
ఇక ఫిదా మూవీ కలెక్షన్ల విషయంలో కూడా ఎక్కడ తగ్గడం లేదు. దిల్ రాజు ఊహించని రెంజ్ కలెక్షన్లు ఈ సినిమా తెచ్చిపెడుతోంది. ఫిదా ఇప్పటి వరకు అమెరికాలో 1. 187 మిలియన్ డలర్లు వాసులు చేసింది. ఈ ఏడాది అక్కడ అత్యదిక వాసులు చేసిన సినిమాల్లో ఫిదా ది నాలుగవ స్థానం. ఇది ఇలా ఉంటే.. రాజకీయలో ప్రతి నిమిషయం బిజీగా ఉండే.. తెలంగాణ ముక్యమంత్రి కేసీఆర్ కూడా ఫిదా మూవీ చూసి.. ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ తెలంగాణ యాసకు ప్రధాన్యత తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆ టైంలో శేఖర్ కమ్ముల తెలంగాణ యాసలో ఫిదా సినిమా తీసి కేసీఆర్ ను కూడా ఫిదా చేశాడు. అయితే కేసీఆర్ కు ముఖ్యంగా ఈ సినిమాలో సాయి పల్లవి నటన అద్భుతంగా నచ్చిందట. ఆమె తెలంగాణ యాసలో మాట్లాడుతూ అద్భుతంగా చేసిందని.. చాలా సహజ నటన కనబర్చిందని కేసీఆర్ అన్నారట.
సాయి పల్లవికి ఓ అద్బుత మైన గిఫ్ట్ కూడా పంపించారని సమాచారం. ఈ గిఫ్ట్ తోపాటు తెలంగాణ యాస లో ప్రింట్ చేపించిన మన తెలంగాణ చరిత్రకు సంబందించిన ఓ పుస్తకం కూడా పల్లవికి బహుకరించారట. ఇక సీఎం కేసీఆర్ మాత్రమే కాదు.. ఆయన తనయుడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా సాయి పల్లవి నటన చూసి ఫిదా అయ్యారట. ఈ విషయంను కేటీఆర్ గారే స్వయంగా తన ట్విటర్ లో వెల్లడించడం విశేషం. ఇదంత చూస్తుంటే.. సాయి పల్లవి అతి త్వరలోనే స్టార్ హీరోయిన్ గా రెంజ్ కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.