ఏపీలో నంద్యాల ఉప ఎన్నికలలలో టీడీపీ మంచి విజయం సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రాజకీయాల్లో ఎప్పుడు లేని విధంగా నంద్యాల ఉపఎన్నిక జరిగింది. వైసీపీ తరుపున ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో సినిమా డైలాగ్సు పెల్చితే.. టీడీపీ తరుపున ప్రచారం చేసే నాయకులు ఉన్నారు కానీ జనంను ఆకట్టుకునే ప్రసంగాలు లేవు.
అదే టైంలో కమెడియన్ వేణు మాధవ్ పిలిపించి.. టీడీపీ తరుపున ప్రచారం చెపించాడు చంద్రబాబు. వేణు మాధవ్ కామెడీ పంచ్ లతో పాటు.. మంచిగా ప్రచారం చేశాడు. వైసీపీ అధినేతపై విరుhచుకుపడ్డాడు. ఒక వైపు జగన్ మీద డైలాగ్స్ వేస్తునే.. రోజా మీద కూడ పంచులు వేశాడు. తన దగ్గర డబ్బు, పత్రికలు, చానెల్స్ లేవంటూ జగన్ అబద్ధపు ప్రచారం చేస్తుంటే టీడీపీ నేతలు దాన్ని సరిగ్గా కౌంటర్ చేయలేకపోయారు. ఆ సయంలో.. సాక్షి పత్రిక, ఛానల్ ఎవరివి అంటూ వేణుమాధవ్ చేసిన కామెంట్స్ నంద్యాల ప్రచారాన్ని వేడెక్కించాయి. దాంతో వేణు మాధవ్ నంద్యాలలో హీరో అయ్యాడు. వైసీపీ అధినేత జగన్ మీద చేసిన కామెంట్స్ కు జగన్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. బెదిరించారు.. దాంతో వేణు మాధవ్ వెనక్కితగ్గాడు. చివరగా.. టీడీపీ ఘనవిజయం సొంతం చేసుకోవడంతో.. చంద్రబాబును కలిసేందుకు వేణుమాధవ్ ఇటివలే అమరావతి వచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి.. అభినందనలు తెలిపారు. నంద్యాల ఉపఎన్నికలలో కీలక పాత్ర పోషించిన వేణు మాధవ్ కు చంద్రబాబు థాంక్స్ చెప్పారట.. పైకి ఒట్టి థాంక్స్ చెప్పిన తెరవెనుక ఎంతో కొంత డబ్బులు ఇచ్చే ఉంటారని సమాచారం.. ఈ సందర్భంగా వేణు మాధవ్ మాట్లాడుతూ.. భవిష్యత్ లో కూడా పార్టీ అవసరాలకి తాను ముందు ఉంటానని బాబుకు మాట ఇచ్చారట.