Tuesday, April 30, 2024
- Advertisement -

జ‌బ‌ర్ధ‌స్త్ కి అనసుయ గుడ్ బై.. ఎందుకు..?

- Advertisement -

బుల్లితెరపై వచ్చే కామెడీ ప్రోగ్రాం జబర్ధస్త్ షోకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ షోలో అనసూయ.. యాంకర్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అనసూయకు సంబంధించి.. ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. త్వ‌ర‌లోనే అన‌సూయ జ‌బ‌ర్ధ‌స్త్ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పబోతుందని తెలుస్తోంది.

బుల్లితెరపై తన అందంతో.. అభినయంతో ఫాలోయింను సంపాదించుకున్న ఈ టాప్ యాంకర్ సోగ్గాడే చిన్ని నాయన, క్షణం సినిమాలలో నటించి.. వెండితెరపై కూడా తన టాలెంట్ చూపించింది. ఈ రెండు సినిమాల్లో నటించి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. విన్నర్ మూవీలో ఐటెమ్ సాంగ్ కూడా చేసింది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న రంగస్థలం సినిమాలో అనసూయ ఓ స్పెషల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ భామకు కన్నడ సినిమాల్లో విఫరీతమైన ఆఫర్లు వస్తున్నాయట.

ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను కన్నడ సినిమాలు వున్నాయట. ఆ సినిమాలు పూర్తయిన తర్వాత ఆమె తెలుగు సినిమాలపై దృష్టి పెడ‌తాన‌ని చెప్తుందట. అంటే జ‌బ‌ర్ద‌స్‌కు గుడ్ బై చెప్పి వెండితెర‌పై సెటిల్ కావాల‌ని ఈ అమ్మ‌డు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు సినీ వర్గాలతో పాటు.. సోష‌ల్ మీడియాలోనూ ఈ వార్త హల్ చల్ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -