మాస్టర్ ,బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ధరించిన జెర్సీ నెంబర్ 10 పై వివాదం నెలకొంది. వన్డేల్లో సచిన్ ధరించిన ఆ జెర్సీతో మరే ఆటగాడు బరిలో దిగొద్దని బీసీసీఐ నిర్ణయించింది. 24 ఏళ్లపాటు క్రికెట్ ఆడిన టెండుల్కర్ 2013 నవంబర్లో ఆటకు వీడ్కోలు పలికాడు. 2012 మార్చిలో పాకిస్థాన్‌సై చివరి వన్డే ఆడిన మాస్టర్ పదో నంబర్ జెర్సీతోనే ఆ మ్యాచ్‌లో బరిలో దిగాడు. అప్పటి నుంచి దాదాపు ఐదేళ్లపాటు ఆ జెర్సీని ఎవరూ ఉపయోగించ లేదు.
ఈ జెర్సీ వివాదానికి కారనం శ్రీలంకతో వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ముంబై పేసర్ శార్దుల్ థాకూర్ గత ఆగష్టులో పదో నంబర్ జెర్సీని ధరించాడు. దీంతో క్రికెట్ అభిమానులు శార్దుల్‌పై మండిపడ్డారు. న్యూమరాలజీ ప్రకారం నాకు పదో నంబర్ కలిసి వస్తుంది, నేను ఆ జెర్సీ వేసుకుంటానని మొదట్లో చెప్పిన శార్దుల్ తర్వాత వెనక్కి తగ్గాడు.
దీనిపై వివాదం చెలరేగడంతో బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. పదో నంబర్ జెర్సీకి అనధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్ తరఫున ఇక మీదట ఎవరూ ఆ జెర్సీ ధరించరని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కాకుండా దేశవాళి, భారత్- ఏ మ్యాచుల్లో ఈ జెర్సీ ధరించవచ్చు. అని’ బీసీసీఐ అధికారులు ఓ జాతీయ చానెల్‌కు తెలిపినట్లు తెలుస్తోంది.