Tuesday, April 30, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ఫస్ట్ లుక్…… త్రివిక్రమ్‌పై ఆ డౌట్స్ పెరిగిపోయాయా?

- Advertisement -

అరవింద సమేత………… వీర రాఘవ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఎన్టీఆర్ అదరగొట్టాడు. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా. మాస్ ప్రేక్షకులు అయితే స్పెల్ బౌండ్ అయ్యారు. దమ్ము సినిమా తర్వాత మళ్ళీ ఆ స్థాయి మాస్ సబ్జెక్ట్‌ని టేకప్ చేయలేదు ఎన్టీఆర్. టెంపర్ తర్వాత నుంచీ క్లాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. నాన్నకు ప్రేమతో సినిమాతో పూర్తిగా నిరూపించుకున్నాడు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలో ఎవ్వరికీ ఏ అనుమానాలూ లేవు. మినిమం కంటెంట్ ఉన్నా కూడా ఓ రేంజ్ బ్లాక్ బస్టర్‌గా బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టగల సామర్థ్యం ఎన్టీఆర్ సొంతం.

అయితే అరవింద సమేత ఫస్ట్ లుక్ చూస్తున్నవాళ్ళకు మాత్రం త్రివిక్రమ్ క్రియేటివిటీపై డౌట్స్ వస్తున్నాయి. ముందుగా టైటిల్ డిజైనింగ్ మొత్తం కూడా అత్తారింటికి దారేది టైటిల్‌ని కాపీ కొట్టి డిజైన్ చేసినట్టుగా ఉంది. ఫాంట్, కలర్ ప్యాటర్న్, డిజైన్ అంతా కూడా అత్తారింటికి దారేది టైటిల్‌కి దగ్గరగా ఉంది. ఇక సిక్స్ ప్యాక్లో బాడీని చూపించడం బాగుంది……….కానీ తలకు బాడీకి ఏదో సింక్ మిస్ అవుతున్నట్టుగా ఆ ఫస్ట్ లుక్ ఉంది. బాడీకి ఎన్టీఆర్ తలను అతికించినట్టుగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ అయితే నందమూరి ఫ్యాన్స్‌తో తెలుగు సినిమా లవర్స్ అందరినీ ఫిదా చేస్తోంది. అయితే త్రివిక్రమ్ క్రియేటివిటీ మాత్రం ఈ ఫస్ట్ లుక్‌లో ఏమీ లేకుండా పోయింది. అసలే త్రివిక్రమ్‌లో జ్యూస్ అయిపోయిందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ముందు ముందు టీజర్ నుంచీ అయినా తన కెపాసిటీ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకునే స్థాయి కంటెంట్ త్రివిక్రమ్ ఇస్తాడేమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -