కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా వస్తున్న తెరి సినిమా టీజర్ ఇప్పుడు ఎక్కడ చూసినా సంచలన సృష్టిస్తోంది. ఈ సినిమా టీజర్ లో విజయ్ చాలా అద్భుతంగా చెయ్యడంతో పాటు ఆకర్షించే స్టోరీ లైన్ ఏ మాత్రం అర్ధం కూడా కాకుండా కట్ చేసిన విధానం మొత్తం అన్నీ అదిరిపోయాయి.
టీజర్ కేవలం యాభై సెకన్లు ఉండగా అందులో విజయ్ మొత్తం గా దున్నేసాడు. టీజర్ మొత్తం అతనే కనిపిస్తూ ఆద్యంత ఆదరగోట్టేసాడు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే వర్డింగ్ ని ఇంత డిఫరెంట్ గా పలకించచ్చని ప్రూవ్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్.
పోలీస్ స్టేషన్ లో విజయ్ పోలీసుగా ఉండి అక్కడ రౌడీ లతో ఆడుకుంటాడు ఆ సమయంలో విజయ్ వారితో ఒక బెత్తం పట్టుకుని అన్నీ చదివిస్తూ మధ్యలో కొడుతూ ఉంటాడు ఆ సీన్ ని చూసిన వారికి ఖచ్చితంగా గబ్బర్ సింగ్ గుర్తొచ్చి తీరుతుంది . ఇది చూసిన కళ్యాణ్ ఫాన్స్ సీరియస్ అవుతున్నారు. మా గబ్బర్ సీన్లే ఇక్కడ దొబ్బేశారు అంటూ సోషల్ సైట్లలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది మినహాయిస్తే.. ‘తెరి’ లో ఫైట్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి.
