Tuesday, April 30, 2024
- Advertisement -

‘పేప‌ర్ బాయ్’ టీజ‌ర్‌

- Advertisement -

దర్శకుడు సంపత్ నంది నిర్మాత‌గా మారి నిర్మించిన సినిమా పేపర్ బాయ్. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్‌ను చూస్తుంటే సాఫ్ట్ ల‌వ్ స్టోరీ లైన్ తో ప్రేమకథగా దీన్ని తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. తాను ఇష్టపడిన అమ్మాయి కోసం పేపర్ వేస్తూ ఓ ఇంటి వంక రోజు చూసే అబ్బాయికి ఓ పెద్దింటి అమ్మాయికి మధ్య జరిగే లవ్ స్టోరీగా దర్శకుడు జయశంకర్ దీన్ని సెన్సిబుల్ గా డీల్ చేసినట్టు టీజర్ కట్ చేసారు.

విజువల్స్ తో ఆకట్టుకునేలా ఉన్న పేపర్ బాయ్ యువతకు కనెక్ట్ అయ్యేలా ఉంది. హీరో పాత్రలో సంతోష్ శోభన్ ఫ్రెష్ గా ఉన్నాడు. రియా సుమన్ హీరోయిన్ గా పరిచయమవుతుండగా మరో పాత్ర తాన్యా హోప్ కూడా నటిస్తోంది. భీమ్స్ అందించిన మ్యూజిక్ ఆహ్లాదకరంగా ఉంది.ఈ సినిమాకు క‌థ‌ను కూడా సంప‌త్ నందినే అందించారు.సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -