- Advertisement -

పవన్ టార్గెట్ తెలంగాణ సిఎం అయితే జగన్ పోరాట స్ఫూర్తి కనిపించేదా?

- Advertisement -

రాజకీయం అంటే అంతే మరి. ఎటూ దక్కదని తెలిస్తే ఎవడికైనా దానం చేస్తారు. తెలంగాణాలో టిడిపి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు కాబట్టే 2014లో తెలంగాణాలో అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తాను అన్నాడు చంద్రబాబు. మరి అదే హామీని ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు అమలు చేయడు అన్న విషయం ఆలోచిస్తే చాలు…….. బాబు రాజకీయం ఇట్టే అర్థమైపోతుంది. ఇక పవన్ కూడా అన్ని విషయాల్లోనూ అబద్ధాలు ఆడే అలవాటుతో సహా అన్నీ కూడా చంద్రబాబు తరహా రాజకీయాలే చేస్తున్నాడు.

తాజాగా కెటీఆర్ పోరాట స్ఫూర్తి గురించి గొప్పగా మాట్లాడాడు. లోకేష్‌కి అంత సీన్ లేదన్నాడు. పోరాటం చేయడం చేతకాదన్నాడు. ఇక్కడ లోకేష్‌కి పోరాడడం చేతకాదు అన్న విషయం అందరికీ తెలిసిందే. చివరికి లోకేష్‌ని ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ ఆశాకిరణంగా నమ్మించడానికి ప్రయత్నిస్తున్న ఎల్లో మీడియాకు, చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. లోకేష్ ఉత్తరకుమారుడే కానీ రాకుమారుడు కాదని స్వయంగా టిడిపి నాయకులే అంతర్గత సంభాషణల్లో జోకులు వేసుకుంటూ ఉంటారు.

లోకేష్ విషయం పక్కన పెడితే కేటీఆర్ పోరాటం కనిపించిన పవన్‌కి జగన్ పోరాటం ఎందుకు కనిపించలేదు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన క్షణం నుంచీ ఈ రోజు వరకూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జగన్ స్థాయిలో ప్రజల మధ్య ఉన్న నాయకుడు ఉన్నాడా? 2014 ఎన్నికల తర్వాత నుంచి ఈ ఎన్నికల ఏడాది వరకూ మోడీతో కలిసి అధికారాన్ని ఎంజాయ్ చేసిన చంద్రబాబుకు…ఎపికి మోడీ చేస్తున్న అన్యాయాన్ని నాలుగేళ్ళుగా దాచేసి మోడీ అద్భుతంగా సాయం చేస్తున్నాడు అని పొగిడాడు చంద్రబాబు. ఇక పవన్ కూడా నాలుగేళ్ళుగా బాబు పాలనను వెనకేసుకొచ్చాడు. చివరికి ఓటుకు కోట్లు కేసులో కూడా బాబునే సమర్థించాడు. తీరా ఎన్నికల ఏడాదిలో మాత్రం ఓట్ల కోసం మోడీకి హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబులాగే బాబుకు హ్యాండ్ ఇచ్చి ప్రజల్లోకి వచ్చాడు పవన్.

కొత్త సేద్యగాడు పొద్దెరగడు అన్నట్టు నాలుగేళ్ళుగా హోదా కోసం పోరాటం, చంద్రబాబు అన్యాయాలు, అక్రమాలు, అవినీతిపై పోరాటం చేస్తున్న జగన్‌ని విమర్శిస్తున్నాడు. 2009ఎన్నికల సమయంలో ఒకసారి కనిపించి………..ఆ తర్వాత మళ్ళీ 2014 ఎన్నికల ఏడాదిలో మరోసారి దర్శనమిచ్చి ఇప్పుడు 2019 ఎన్నికల కోసం మళ్ళీ వచ్చిన పవన్‌కి పార్టీ స్థాపించిన మరుక్షణం నుంచీ ప్రజల మధ్యనే ఉన్న జగన్‌ని విమర్శించే అర్హత ఉందా? రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీ ఇచ్చి ఉంటే ఈ రోజు జగన్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని ఉండేవాడు. అయినప్పటికీ జగన్ ఆ అబద్ధపు హామీ ఇవ్వలేదు. అలాంటి జగన్‌కి అధికార యావ అని విమర్శించే అర్హత కేవలం ఎన్నికల ఏడాదిలో ప్రజల ఓట్ల కోసం రాజకీయాలు చేసే వాళ్ళకు ఉంటుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -