బిగ్‌బాస్ రెండో సీజన్ తుది అంకానికి చేరుకుంది. గత 104 రోజులుగా బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి రోజు అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 ముగింపు దశకు చేరుకుంది. ఇక శనివారం జరిగిన ఎపిసోడ్లో నాని షోని చాలా ఎమోషనల్‌గా నడిపించాడు. నాని హౌస్‌మెట్స్‌తో మాట్లాడుతు గడిచిన వారం హౌస్‌లో మీ ప్రవర్తన వల్ల చాలా నిరుత్సాహానికి గురయ్యా అన్నారు నాని. కౌశల్‌ని టచ్ చెయ్ తనీష్ చూద్దాం. హౌస్ నుండి ప్రేక్షకులకు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ మండి పడ్డారు నాని. నువ్వు ఇదే మాట బయట అని ఉంటే ఏం చేసేవాడినో తెలుసా అంటూ కౌశల్‌ని హెచ్చరించావు.
ఇప్పుడే నిన్ను కౌశల్‌ని బయటకు పంపిస్తా.. కౌశల్‌ని టచ్ చేయి చూద్దాం, నువ్వేమన్నా పెద్ద రౌడీవా అంటూ తనీష్‌ని గట్టిగా మందలించారు నాని. మొదటి నుంచి నీ పవర్తనను మార్చుకోవలని హెచ్చరిస్తురన్న నీ ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదని తనీష్‌ని హెచ్చరించాడు నాని. ఇక ఈ శనివారం బిగ్‌బాస్ రెండో సీజన్‌కు చివరిదిగా ప్రకటించాడు నాని. గ్రాండ్ ఫినాలేకు వెళ్లిన సామ్రాట్‌కు అభినందనలు తెలిపాడు నాని. ఇక ఎలిమినేషన్‌ను ఆదివారానికి వాయిదా వేశాడు. ఏది ఏమైనా శనివారం జరిగిన ఎపిసోడ్ కాస్తా ఎమోషనల్‌గానే సాగిందని చెప్పాలి.