అబుదాబి వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ అదరగొట్టాడు. ఆరు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఇలా రెండో టెస్టులోని తొలి రోజు లంచ్ విరామానికి 77-5 స్కోరుతో పాక్ జట్టుని కట్టడి చేస్తోంది.
నాలుగో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన లియోన్ అజార్ అలీని క్యాచ్‌తో ఔట్ చేశాడు. ఆ తర్వాత బంతికే హారిస్ సొహైల్ మరో క్యాచ్‌తో అప్పుకున్నాడు. అతని తర్వాతి ఓవర్లో లియోన్ అసద్ షఫిక్ మళ్లీ అదే తరహాలో క్యాచ్‌తో.. ఒక 2బంతుల వ్యవధిలో మరో సారి బాబర్ అజామ్‌ను అవుట్ చేయడంతో పాక్ బ్యాట్స్‌మెన్‌కు స్కోరు చేసే అవకాశమే లేకుండా పోయింది.
హ్యాట్రిక్ చేజారినప్పటికీ.. ఆరు బంతుల వ్యవధిలో నాలుగు కీలక వికెట్లు తీసి పాక్‌ను కష్టాల్లోకి నెట్టాడు. ఓపెనర్ ఫకర్ జమాన్ (49 బ్యాటింగ్), కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (4 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు. దీంతో లంచ్ విరామ సమయానికి పాకిస్థాన్ 5 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.
