Thursday, May 2, 2024
- Advertisement -

మొద‌టి సారి ఓటు వేసిన గ‌ద్ద‌ర్‌..ఏమ‌న్నారంటే..?

- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 70 ఏళ్లుగా పోలింగ్‌కు దూరంగా ఉన్న ప్రజా యుద్ధనౌక గద్దర్ తన జీవితంలో తొలిసారిగా ఓటు వేశారు. ఓటు వేసి, గొప్ప అనుభూతిని పొందారు. గద్దర్ తో పాటు ఆయన సతీమణి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సికింద్రాబాద్ ఆల్వాల్ పరిధిలోని భూదేవినగర్ లో 70 ఏళ్ల వయసులో ఆయన తొలిసారి ఓటు వేశారు. గతంలో భువనగిరిలో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసే సమయంలో గద్దర్.. మావోయిస్టు కార్యకలాపాల పట్ల ఆకర్షితులయ్యారు. నాటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తన జీవితంలో ఒక్కసారి కూడా ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోకపోవడం గమనార్హం.

ఓటు వేసిన త‌ర్వాత గ‌ద్ద‌ర్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా గొప్పదని.. దాన్ని సరిగి వినియోగించుకోవాలని గద్దర్ పిలుపునిచ్చారు. ఓటు రాష్ట్ర రాజకీయ నిర్మాణానికి రూపమని.. ఓట్ల విప్లవం వర్ధిల్లాలని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -