అతిలోక సుందరి శ్రీదేవి మరణించి చాలకాలమైనప్పటికి ,ఆమె గురించి నిత్యం ఏదో ఒకటి వార్తల్లో నిలుస్తునే ఉన్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ ధడక్ సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో వెంటనే తన రెండో సినిమాను కూడా లైన్లో పెట్టింది జాన్వీ. తాజాగా జాన్వీ ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి ఫోటోషూట్ ఇచ్చింది.
‘లాఫిసియాల్’ అనే ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఇండియా ఎడిషన్ కవర్ పేజీపై తళుక్కున మెరిసింది. ఇది డిసెంబర్ ఎడిషన్. బ్లూ కలర్ టాప్ తో పాటుగా డార్క్ బ్లూ కాంబినేషన్ లో స్కర్ట్.. బ్లూ కలర్ టై ని మెడలో వేసుకుంది. బ్యాక్ గ్రౌండ్ లో సిల్వర్ కలర్లో మెరిసే డెకరేషన్ పేపర్ ను ఉంచడం తో థీమ్ సూపర్ గా సెట్ అయింది. జాన్వి తన స్కర్టుని కాస్త లుంగీ టైపులో అలా ఎత్తి పట్టుకుంది. ఈ ఫోటోలో జాన్వీని చూసినవారు అమ్మ శ్రీదేవికి జాన్వీ ఎక్కడ తగ్గడం లేదని కామెంట్స్ చేస్తున్నారు.
- నిర్మాతగా మారిన యాంకర్ ఉదయభాను!
- పాండ్యాతో డేటింగ్ ప్రచారంపై అమీషా పటేల్ ఏమన్నారంటే..?
- రజనీకాంత్ అభిమానులకు గుడ్‌న్యూస్!
- ‘ఏషనాగుల’ అంటూ అదరగొట్టిన నాని, కీర్తి!
- ‘#KING 100’ గ్లింప్స్ వచ్చేసింది!
- ‘ఈ వారాహికి ఎదురెళ్లి.. ఆవిడతోనే ఈ శాపం తప్పిస్తాను’
