- Advertisement -
కేసీఆర్‌ను ఓడించేందుకు మహాకూటమి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. బుధవారం తెలంగాణా భవన్లో టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశం తెలంగాణ భవన్లో జరగనుంది. టీఆర్ఎస్ ఎల్పీపక్ష నేతగా కేసీఆర్‌ను ఈ సమావేశంలో ఆ పార్టీలు ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు.
ఆ తర్వాత గవర్నర్‌కు శాసన సభాపక్ష తీర్మాన ప్రతిని కేసీఆర్ అందజేసి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తారు. దీనికి అనుగుణంగా గురువారం ఉదయం 9 గంటలలోపు ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాజ్‌భవన్, సాధారణ పరిపాలన శాఖ అధికారులు ముమ్మరం చేశారు. ఆహ్వాన పత్రికలను బుధవారం ముద్రించి ప్రముఖులకు పంపిణీ చేయనున్నారు. ఇక, మంత్రి వర్గ కూర్పుపై మంగళవారం రాత్రి నుంచి కసరత్తు ప్రారంభించారు. దీనిపై అత్యంత సన్నిహితులతో సమావేశమై కేసీఆర్ వారితో చర్చించినట్లు తెలుస్తోంది