నేను సింగిల్ గా ఉన్నానని ఎవరు చెప్పారు..? అంటూ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది సమంత. ఈ కమెంట్స్ విన్న తర్వాత సమంత మళ్లీ ప్రేమలో పడిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక్కడ అసలు విశేషమేంటంటే.. తాజాగా మరో ఇంటర్వ్యూలో తాను పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు చెప్పింది ఈ బ్యూటీ. ఇప్పటికే తన వయసు 29 ఏళ్లు కాబట్టి మరో ఏడాదిలో పెళ్లి చేసుకుంటానంటూ చెప్పింది ఈ ముద్దుగమ్మ.
తన స్నేహితుల పిల్లల్ని చూస్తున్నపుడు తనకు కూడా అలా పిల్లలు ఉంటే బాగుంటుందని అనిపిస్తుందంటోంది ఈ భామ. దాంతో త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది సమంత. సమంత మాటల్ని బట్టి చూస్తే ఇప్పటికే ఆమె ప్రేమలో పడిందనే విషయం స్పష్టమవుతోంది. ఇక ఇప్పుడు మరో అప్ డేట్ కూడా బయటికి వచ్చింది. ఈ భామ ప్రేమలో ఉన్నది ఎవరితోనో కాదు.. ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ కుర్ర హీరోతో అని.
ఈ కుర్రాడేం తక్కువోడు కాదు.. చాలా పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోనే. గతంలో సమంత ఈయనతో కలిసి మూడు సినిమాల్లోనూ నటించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయిందనే మంచి పేరుంది. ఆ హీరోతోనే ప్రస్తుతం ఈ భామ ప్రేమలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.