భార‌త్‌లో ఆసిస్ షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన బీసీసీఐ..

ఇండియాలో ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. ఇరు జ‌ట్ల మ‌ధ్య ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13 వరకు ఇండియాలో రెండు టీ20లు, ఐదు వన్డేలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుద‌ల అయ్యింది. ఫిబ్రవరి 24న బెంగళూరులో తొలి టీ20, 27న విశాఖపట్నంలో రెండో టీ20 మ్యాచ్ జరగనున్నాయి.

టీ20 షెడ్యూల్:
ఫిబ్రవరి 24 – తొలి టీ20 – బెంగళూరు
ఫిబ్రవరి 27 – రెండో టీ20 – విశాఖపట్నం

వన్డే షెడ్యూల్:
మార్చి 2 – తొలి వన్డే – హైదరాబాద్
మార్చి 5 – రెండో వన్డే – నాగపూర్
మార్చి 8 – మూడో వన్డే – రాంచీ
మార్చి 10 – నాలుగో వన్డే – మొహాలీ
మార్చి 13 – ఐదో వన్డే – ఢిల్లీ