మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమా తరువాత నటించిన చిత్రం వినయ విధేయ రామ. బోయపాటి వంటి దర్శకుడు సినిమాకు దర్శకత్వం వహించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాని అందరి అంచనాలను తలకిందులు చేస్తు సినిమా భారీ డిజాస్టార్‌గా నిలిచింది. సంక్రాంతికి విడుదల అయన ఈ సినిమా ఏమంత బాలేదని ప్రేక్షకులు తెల్చేశారు.
అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికి సంక్రాంతి సీజన్ ఈ వినయ విధేయ రామకు కలిసి వచ్చింది. సంక్రాంతి సెలవలు కావడంతో సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి. అయినప్పటికి 30 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది ఈ సినిమా. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విలువ రూ. 92 కోట్లు కాగా ఫుల్ రన్ లో రూ.62.64 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ మాత్రమే రాబట్టగలిగింది. ముప్పై కోట్ల నష్టాలతో డిజాస్టర్ గా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా ‘వినయ విధేయ రామ’ క్లోజింగ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజామ్: 12.58 cr
సీడెడ్: 11.92 cr
ఉత్తరాంధ్ర: 8.51 cr
కృష్ణ: 3.69 cr
గుంటూరు: 6.36 cr
ఈస్ట్ : 5.42 cr
వెస్ట్: 4.42 cr
నెల్లూరు: 2.89 cr
ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 55.79 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా: 5.40 cr
ఓవర్సీస్: 1.45 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 62.64 cr
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’