ప్రిన్స్ మహేశ్ బాబు రూటు మార్చాడు. ఒకవైపు తన టాలీవుడ్ లోని హీరోలు తమ సినిమాల బడ్జెట్ విషయంలో రికార్డుల మీద రికార్డులు సృష్టించేస్తున్నారు.
భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించేయడంలో వీరు ఒకరిని మరొకరు మించిపోతున్న సమయంలో మహేశ్ బాబు బడ్జెట్ కంట్రోల్ మొదలు పెట్టాడు. అలా కంట్రోల్ చేయడానికి ప్రిన్స్ స్వయంగా నిర్మాతగా మారడం విశేషం!
మహేశ్ బాబు సొంత ప్రొడక్షన్ హౌస్ కు ‘ఎమ్ బి’ గా నామకరణం చేశాడు. మహేశ్ బాబు అనే పేరకు ‘ఎమ్ బి’ అనేది షార్ట్ ఫామ్ అని అవుతుందని వేరే చెప్పనక్కర్లేదు. ఈ ప్రొడక్షన్ హౌస్ పూర్తి పేరు ఘట్టమనేని మహేశ్ బాబు ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అని తెలుస్తోంది. ‘శ్రీమంతుడు” సినిమాతోనే నిర్మాతగా మహేశ్ బాబు కెరీర్ మొదలుపెడుతున్నాడు.
ఇంతకు ముందు మహేశ్ బాబుతో ఎవరు సినిమాలు తీసిన అందులో ఈ హీరోకి కూడా కొంత వాటా ఉండేది. మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు లేదా.. సోదరి మంజులలు నిర్మాతలుగా వ్యవహరించే వారు. అయితే ఇప్పుడు మహేశ్ బాబు సొంతంగా నిర్మాతగా మారుతుండటం విశేషం. ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ ను తగ్గించేసుకొని.. ప్రొడక్షన్ ఖర్చులను కూడా నియంత్రించుకొంటూ మహేశ్ సినిమా బడ్జెట్ ను తగ్గించడానికి తీవ్రంగానే ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. మరి నిర్మాతగా.. మహేశ్ బాబు కెరీర్ ఎలా ఉంటుందో చూడాలిక!
