Tuesday, April 30, 2024
- Advertisement -

విల‌న్‌గా నాని..హీరోగా సుధీర్ బాబు

- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని విల‌న్‌గా మారుతున్నాడా..? అంటే అవున‌నే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. ‘కృష్ణార్జున యుద్ధం’.. ‘దేవదాస్’ సినిమాలు ప్లాప్‌తో నాని ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట‌. రోటిన్ సినిమాలు చేస్తే ప్రేక్ష‌కులు చూసే రోజులు పోయాయ‌ని భావిస్తున్నాడట నాని. దీనిలో భాగంగానే నాని విల‌న్‌గా ఓ సినిమాలో న‌టించ‌బోతున్నాడు. త‌న‌కు అష్ట చ‌మ్మాతో తొలి హిట్ ఇచ్చిన ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో చేసేందుకు మ‌రోసారి రెడీ అవుతున్నాడు నాని. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రెండు సినిమాలు వ‌చ్చాయి.

జెంటిల్‌మెన్‌ సినిమా కూడా మంచి విజ‌యం సొంతం చేసుకుంది. నాని కోసం ప్ర‌త్యేకంగా ఓ క‌థ‌ను సిద్ధం చేశాడ‌ట ఇంద్రగంటి మోహన కృష్ణ.ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తాడని టాక్ విన్పిస్తోంది. ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడట. ఏదేమైనా తెలుగులో ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఇలా నెగెటివ్ రోల్ చేయడం సెన్సేషనే అని చెప్పాలి. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించ‌నున్నారు. నాని ప్ర‌స్తుతం జెర్సీ మూవీలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో నాని క్రికెట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాను వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా త‌రువాత విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సినిమా పూర్తి అవ్వ‌గానే ఇంద్రగంటి మోహన కృష్ణ సినిమాను మొద‌లు పెడ‌తాడు నాని. ఈ సినిమా నాని కెరీర్‌లో 25వ చిత్రంగా తెర‌కెక్కుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -