Sunday, May 19, 2024
- Advertisement -

ఈదురుగాలులు… కారుమబ్బులు

- Advertisement -

హైదరాబాద్ ను వర్షం ముంచెత్తింది. శుక్రవారం మధ్యాహ్నం వరకూ మంచి ఎండ కాసిన హైదరాబాద్, సికింద్రాబాద్ ల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కారు మబ్బులు కమ్మకున్నాయి. చిన్నగా ప్రారంభమైన చినుకులు అలా అలా పెద్ద వర్షంగా మారింది. దీంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి.

ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందామని నగర వాసులు భావించినా భారీ వర్షం మాత్రం వారిని భయపెట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మొహదీపట్నం, వనస్ధలిపురం, దిల్ సుక్ నగర్, మల్కా.జిగిరి, సికింద్రాబాద్, పంజాగుట్ట ఇలా అన్ని ప్రధాన ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లగానే ఉంది. మబ్బులు ఆకాశాన్ని వీడలేదు. అడపాదడపా చినుకులు పడుతూనే ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -