విశాఖలో ఆసిస్‌తో జరిగిన మొదటి టీ20లో భారత్ పరాసయాన్ని చవిచూసింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం ఆసిస్‌ను వరించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆసిస్ బౌలర్ల దాటికి 126 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్, కోహ్లీ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ ఆపసోపాలు పడుతూ 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో తమ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. తమ బౌలర్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉందన్నాడు. ‘బౌలర్ల పోరాటం చూస్తే చాలా గర్వంగా ఉంది. మేం ఈ మ్యాచ్‌ను ఇంత వరకు లాక్కొస్తామని అస్సలు ఊహించలేదన్నారు. బూమ్రాఅద్భుతంగా బౌలింగ్ చేశాడన్నారు. 15వ ఓవర్ వరకు పిచ్ బ్యాటింగ్‌కు ఏ మాత్రం సహకరించలేదు. మేం బ్యాటింగ్‌లో వైఫల్యం చెందామన్నారు. కేఎల్ రాహుల్ అద్భతంగా ఆడారన్నారు. మా కంటే అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆసీస్ ఆటగాళ్లు ఈ విజయానికి అర్హులంటూ కొనియాడారు.
