టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది ప్రియాంక జవాల్కర్. అందం , అభినయం , పైగా తెలుగు అమ్మాయి కావడంలో ప్రియాంక జవాల్కర్‌కు పాజిటివ్‌గా మారాయి. టాక్సీవాలా సినిమా మంచి విజయం సాధించడంతో ఈ భామకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అక్కినేని హీరోగా నటించే కొత్త సినిమాలో హీరోయిన్గా ప్రియాంక జవాల్కర్‌ను తీసుకున్నారని తెలుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ తన నాల్గొవ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించనున్నారు.
తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక జవాల్కర్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం. రవితేజ నటిస్తోన్న డిస్కోరాజా సినిమాలో కూడా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్గా నటిస్తుందట.అఖిల్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందంటే ఈ భామకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. కథ ప్రకారంలో సినిమాలో మరో హీరోయిన్ ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే మెయిన్ హీరోయిన్గా మాత్రం ప్రియాంక జవాల్కర్ నటిస్తుందట.