తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ రెండో సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చాడు కౌశల్. అంతకముందు కొన్ని సినిమాలు చేశాడు. తరువాత సీరియల్స్‌లో నటిస్తు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్ ద్వారా చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ రియాల్టీ షో ద్వారా అతనికి ఓ ఆర్మీ కూడా క్రియేట్ అయింది. బిగ్‌బాస్‌లో కౌశల్ ఉన్నప్పుడు అతని మద్దతుగా ఏర్పడింది కౌశల్ ఆర్మీ. బిగ్‌బాస్ హౌస్‌లో కౌశల్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన వారిని ట్రోలింగ్ చేసేవారు ఈ ఆర్మీ. అతను విన్నర్‌గా నిలవడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అతను విన్నర్‌గా నిలిచిన తరువాత కౌశల్ ఆర్మీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు సడన్‌గా కౌశల్‌పై ఈ ఆర్మీ నెగిటివ్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. కౌశల్‌కు డబ్బు పిచ్చి ఎక్కువ అయిందని కౌశల్ ఆర్మీ ఫౌండర్ ఇమామ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా ఈ కామెంట్స్‌పై స్పందించాడు కౌశల్.
తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కౌశల్. నా ఆరోపణలు చేసిన వారిని సాక్ష్యాలు ఉంటే బయటపెట్టాలని తెలిపాడు.ఇటువంటి చెత్తపై మాట్లాడే ఇంటరెస్ట్ కూడా తనకు లేదని, ఇలాంటి నిరాధారమైన విషయాలపై స్పందిస్తూ పోతే తనను మరింత తగ్గించాలని చూస్తారని అన్నాడు. ఎవరో కొందరు చేసే ఆరోపణలు తన స్థాయిని తగ్గించలేవని అన్నారు. కాలం గడిచే కొద్ది అన్ని విషయాలకు సమాధానం దొరుకుతుందని అన్నారు. అయితే కౌశల్ చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. కౌశల్ అసలు రూపం ఇప్పుడే బయటపడుతుందని వారు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆర్మీ కూడా ఎక్కడ తగ్గడం లేదు. కౌశల్ మా డబ్బులతో ఎంజాయ్ చేశాడని, అతని కోసం మేం ఒక హోటల్ బుక్ చేస్తే ,ఇలాంటి నాసిరకం హోటల్‌ను బుక్ చేస్తారా అని మాపై కౌశల్ మండిపడ్డాడు. ఇదే హోటల్లో పవన్ కూడా బస చేశారని చెప్పగా వాడు ఎవడో దిగడని నేను కూడా ఇక్కడే దిగలా అని మాపై దురుసుగా ప్రవర్తించాడని వారు చెబుతున్నారు. మరి ఈ వివాదం మరింత ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
- Advertisement -
అభిమానాన్ని చెత్తతో పోల్చిన బిగ్‌బాస్ కౌశల్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -