ఈ రోజుల్లో తెలిసిన వారికే ఒక రూపాయి ఇవ్వలంటే వందసార్లు ఆలోచిస్తుంటాం. అలాంటి తన దగ్గర పని చేసే వ్యక్తికి ఏకంగా 50 లక్షలు ఇచ్చి సహాయం చేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచాయి. ఆమె సక్సెస్ రేటు కూడా ఎక్కువే.
ఇదే సమయంలో తన దగ్గర పని చేస్తున్న వారికి కోటీ రూపాయిల విలువైన బహుమానాలను ఇచ్చి అందరికి షాకిచ్చింది. ఈ నెల 15న ఆలియా భట్ తన 26వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెల్సిందే. పుట్టిన రోజు సందర్భంగా తన దగ్గర పని చేస్తున్నవారికి సాయం చేయలని భావించిదట ఆలియా. తన దగ్గర ఎప్పటి నుంచో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తితో పాటు, తన ఇంట్లో చినప్పటి నుండి కూడా పని చేస్తున్న పని మనిషికి చేరో ఇల్లు కొనిచ్చిందట. ఈ ఇళ్లు ఖరీదు సుమారు 50 లక్షల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా చూసుకుందట ఆలియా.
కాని మీడియా ఏ బొక్కలో ఏ పాము ఉందో చూసే రకం కదా, ఆలియా ఇలా తన దగ్గర పనిచేస్తున్న వారికి ఇల్లు కొనిచ్చిందని మీడియాకు తెలియడంతో , ఈ న్యూస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ విషయం ఇప్పుడు అందరికి తెలియడంతో ఆలియాది ఎంత మంచి మనస్సు అంటూ ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
- Advertisement -
డ్రైవర్‌కు 50 లక్షలు ఆర్థికసాయం చేసిన స్టార్ హీరోయిన్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -