టాలీవుడ్ కింగ్ నాగర్జున , లేడి సూపర్ స్టార్ విజయశాంతి ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో ఈ జంట టాలీవుడ్‌లో హిట్ పెయిర్‌గా నిలిచారు. అయితే గతం , ఇప్పుడు పరిస్థితి మారింది. నాగర్జున అంటే చాలు మండిపడుతుంది విజయశాంతి.
కారణం తెలియదు కాని నాగర్జునకు సంబంధించిన ఆస్తులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నిస్తోంది విజయశాంతి. సినీ హీరో నాగార్జున అక్రమంగా భూములను రెగులరైజ్ చేసుకున్నారన్న ఆరోపణలపై ఎందుకు చర్య తీసుకోలేదని తెలంగాణ ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారని తెలిపింది విజయశాంతి. గతంలో కేసీఆర్ మాట్లాడుతు హీరో నాగార్జున హైదరాబాద్ శివార్లలోని భూములను అక్రమంగా సొంతం చేసుకున్నారని , మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ భుములను స్వాధీనం చేసుకుంటామని చెప్పిన మాటలు ఏమైయ్యాయని విజయశాంతి ప్రశ్నించింది.
ఏదో బలమైన కారణం ఉండటం వల్ల వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చి ఉంటయాని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని కారణంగానే విజయశాంతి నాగ్‌పై ఇలా రెచ్చిపోతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
- Advertisement -
నాగర్జున అంటే విజయశాంతికి ఎందుకంత పగ..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -