ఈ రోజుల్లో ప్రేమ, బ్రేకప్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఈ విషయంలో సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ హీరో, హీరోయిన్లు అయితే ఈ విషయంలో బాగా ముదిరిపోయారనే చెప్పాలి. బాలీవుడ్లో ఎఫైర్స్ కాస్తా ఎక్కువనే చెప్పాలి. హీరో, హీరోయిన్లు బాడీ మీద డ్రెస్లను మార్చినట్లుగా ప్రేమించిన వారిని మార్చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్లో మరో జంట బ్రేకప్ చేప్పుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే…తెలుగు నటుడు హర్షవర్ధన్ రానే గుర్తు ఉన్నాడు కదా! అదేనండి ‘అవును’, ‘అవును 2’, ‘అనామిక’, ‘ఫిదా’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మధ్య మనోడికి బాలీవుడ్ సినిమాల్లో ఆఫర్ కూడా వచ్చింది. ఈ సమయంలోనే బాలీవుడ్ హీరోయిన్ కిమ్ శర్మతో ఎఫైర్ మొదలుపెట్టాడు. వీరిద్దరు చాలాకాం నుంచి డేటింగ్లో ఉన్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలను కూడా ప్రచురించింది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అయితే ఇకపై ఈ జంట కలిసి కనిపించే అవకాశాలు లేవని తెలుస్తోంది. తాజాగా వీరిద్దరి విడిపోయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని హర్షవర్ధన్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. వీరిద్దరి మధ్య గొడవ రావడంతో ఒకరితో మరొకరికి పడడం లేదట. దీంతో బ్రేకప్ అయినట్లు సమాచారం. కిమ్ శర్మకు ఇప్పటికే పెళ్లి అయి ఓ బాబు కూడా ఉన్నాడు. భర్త నుంచి విడాకులు తీసుకుని కొడుకుతో వేరుగా ఉంటుంది కిమ్ శర్మ. ఈ భామ తెలుగులో కూడా నటించింది. ‘ఖడ్గం’, ‘మగధీర’ వంటి చిత్రాలలో నటించింది కిమ్ శర్మ.