తెలుగు కుర్రాడే గానీ తమిళం లో స్టార్ హీరోగా ఎదిగిన విశాల్ నిజజీవితంలో కూడా హీరో అనిపించుకుంటూ సాగుతున్నాడు. నడిగర్ సంఘం ఎన్నికలలో సరిగ్గా పనిచెయ్యని గత అధ్యక్షుడు శరత్ కుమార్ మీద తిరుగుబాటు బావుటా ఎగరవేసి మరీ అతన్ని ఎదిరించి ఎన్నికల్లో గెలిచాడు. ఇప్పుడు నడిఘర్ తరఫున చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్న మనోడు కార్తి , నాజర్ ల సహాయం తో మంచి పొజిషన్ కి వచ్చేసాడు.
శరత్ కుమార్ కీ విశాల్ కీ ఎన్నికల ముందు నుంచే అస్సలు పడ్డం లేదు. విశాల్ వలన ఎన్నాళ్ళ నుంచో ఉన్న అతని పదవి పోగొట్టుకున్న శరత్ ఇప్పుడు అందరి ముందరా తన విలువని కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏకంగా శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి తో అతని ప్రేమాయణం తలనొప్పిగా మారింది శరత్ కి.
విశాల్ – వరలక్ష్మి ల మధ్య ఎదో ఉంది అని ఎప్పటి నుంచో తమిళ మీడియా చెబుతున్నా శరత్ – విశాల్ ఇద్దరూ ఖండిస్తూ వచ్చారు అయితే తాజాగా వరలక్ష్మితో కలిసి చాలా క్లోజ్ గా ఉన్న ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన విశాల్.. ‘‘దట్స్ ఇట్’’ అని వ్యాఖ్యానించాడు. దీంతో విశాల్ ఏం చెప్పదలుచుకున్నాడో అందరికీ అర్థమైంది. ఐతే విశాల్ ఈ ట్వీట్ చేసిన సమయంలోనే శరత్ కుమార్ అనారోగ్యం పాలవడం గమనార్హం. శరత్ కి హార్ట్ అటాక్ అని ప్రచారం జరుగుతోంది !