ఈ సంవత్సరం మొదట్లో నే అతి పెద్ద హిట్ సంపాదించారు వరుణ్ తేజ్. వెంకటేష్ తో కలిసి నటించిన f2 చిత్రం పెద్ద విజయం సాధించిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా లో వరుణ్ తేజ్ పాత్ర కి వచ్చిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కాదు. ఈ సినిమా తో వరుణ్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అలాగే అమెరికా లో కూడా తన సత్తా చాటాడు. తన మార్కెట్ కూడా పుంజుకున్న నేపథ్యం లో ఇదే సరైన సమయం అని భావించిన వరుణ్ తన పారితోషికాన్ని అమాంతం పెంచేసాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ సినిమా కి మూడు కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు.
ఇప్పుడు ఈ పారితోషికం కాస్త డబుల్ అయినట్లు తెలుస్తుంది. మూడు కోట్ల పారితోషికం కాస్త ఆరు కోట్లు అయిందట. అది కూడా తన తదుపరి చిత్రం వాల్మీకి తో మొదలు కానుంది అంట. ఈ సినిమా కి రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. పూజ హెగ్డే ఈ సినిమా నుండి వైదొలగడం తో ఇప్పుడు మరొక హీరోయిన్ కోసం వెతుకులాట మొదలు పెట్టారు.
