మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ నిప్పులు చెరిగారు. బాబు హయాంలో ఎక్కువ హత్యా రాజకీయాలు చోటు చేసుకున్నాయన్నారు. హత్యా రాజకీయాలకు చంద్రబాబుకు పేటెంట్ కూడా ఉందని ఎద్దేవ చేశారు.టీడీపీ హయాంలో వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో ప్రజలను టీడీపీ నేతలు దోచుకోవడం తప్ప… చంద్రబాబు సాధించింది శూన్యమని అన్నారు.
గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబును తనిఖీలు చేశారని కొన్ని పత్రికలు గగ్గోలు పెడుతున్నాయని మండి పడ్డారు.జడ్ ప్లస్ కేటగిరీ అనేది ఏవియేషన్ లో వర్తించదని… ఆ విషయాన్ని ఏపీడీ అధికారులే స్వయంగా చెప్పారని అన్నారు. నిబంధనలకు అనుగుణంగానే అధికారులు తనిఖీలు చేశారని చెప్పారు. చంద్రబాబుకు చింత చచ్చినా ..పులుపు చావలేదన్నారు.