Tuesday, April 30, 2024
- Advertisement -

చలో కథ తనదే అంటున్న హీరో

- Advertisement -

యువ కథానాయకుడు నాగ శౌర్య ప్రస్తుతం తన తదుపరి చిత్రం అశ్వద్ధామ కి సంబందించిన షూటింగ్ లో బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఓ బేబీ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటున్నాడు. అయితే అశ్వద్ధామ సినిమా తో శౌర్య హీరో గా నే కాకుండా రచయిత గా కూడా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమా కి కథ తనే రాసుకున్నాడు.ఇప్పుడు ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్న శౌర్య తన కెరీర్ లో పెద్ద హిట్ అయిన చలో సినిమా కి సంబంధించి ఒక ఆసక్తికర విషయం చెప్పాడు.

అయితే చలో సినిమా తో వెంకీ కుడుములు దర్శకుడి గా ఎంట్రీ ఇచ్చాడు. శౌర్య చెప్తున్న దాని ప్రకారం ఆ సినిమా కి కూడా కథ తనే ఇచ్చాడట. విచిత్రం ఏంటి అంటే క్రెడిట్స్ లో కథ కి సంబంధించి శౌర్య పేరు కనిపించదు కానీ శౌర్య, సినిమా రిలీజ్ అయినా చాలా రోజులకి కథ తనది అని చెప్తున్నాడు. శౌర్య కథ ఇచ్చి జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే భయం తో వెనక్కి తగ్గి ఇప్పుడు ఈ సినిమా కి క్రెడిట్ తీసుకుంటున్నాడా, లేక ఐడియా చెప్పి డెవలప్ చేయించినందుకు కథ తనది అని చెప్పుకుంటున్నాడా అర్ధం కావడం లేదు.

ఏది ఏమైనా సినిమా రిలీజ్ అయినా చాన్నాళ్ళకి, అది కూడా హిట్ అవ్వడం తో ఇప్పుడు వచ్చి కథ తనది అని చెప్పడం కరెక్ట్ గా అనిపించడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -