వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ తో చివరి బంతి వరకు హోరాహోరీగా పోరాడిన న్యూజిలాండ్ జట్టు ఐసీసీ నిబంధన కారణంగా రన్నరప్ తో సరిపెట్టుకుంది. దీంతో ఐసీసీ నిబంధనలపై విమర్శలు వెల్లువెత్తాయి. న్యూజిలాండ్ ఓడినా ఆజట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఎంతో హుందాగా వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా విలియమ్సన్ ను ప్రశంసలు కురిపించాడు. విలియమ్సన్ నాయకత్వాన్ని, హుందాతనాన్ని మెచ్చుకున్నాడు. దురదృష్టవశాత్తు ప్రపంచకప్ చేజారినప్పటికీ కివీస్ కెప్టెన్ గౌరవంగా ఫలితాన్ని అంగీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాడని పేర్కొన్నాడు.
ఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత రెండ్రోజుల పాటు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా నువ్వు పాటించిన మౌనం చాలా గొప్పగా ఉంది. ఎంతో సంక్లిష్టమైన పరిస్థితిలో నువ్వు చూపించిన ఓర్పు చిరస్థాయిగా నిలిచిపోతుందంన్నారు. ప్రపంచకప్ టైటిల్ తృటిలో చేజారినప్పటికీ మా దృష్టిలో మీరు కూడా విజేతలే. నువ్వు సమర్థుడైన ఆటగాడివి’ అంటూ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు.