ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు షో మూడో సీజన్ కి ఎంటర్ అయింది. ఈ షో ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎంతో ఆత్రుత తో ఎదురు చూసారు. గత రెండు సీజన్ ల తో పోలిస్తే ఈ సారి ఉన్న హౌస్ మేట్స్ మీద అందరికీ ఎంతో సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. ఇప్పటికీ హౌస్ మేట్స్ మీద ఒక అభిప్రాయం ఎవరికీ రాలేదు. అయితే సోషల్ మీడియా లో బిగ్ బాస్ విన్నర్ ఎవరయి ఉంటారు అనే విషయం మీద ఇప్పటికే చర్చ మొదలైపోయింది. అయితే ఎవరు విన్నర్ గా ఉంటారు అనేది తేలాలి అంటే ఇంకా చాలా రోజులు ఆగాలి. ఈ నేపథ్యం లో బిగ్ బాస్ ఎవరు గెలుస్తారు అనే విషయం లో ఒక ఆసక్తికర విషయం ప్రచారం లో ఉంది.
పవన్ కళ్యాణ్ అభిమాని అయితే, పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తే చాలు, వారే బిగ్ బాస్ విన్నర్ అవుతారు అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియా లో సాగుతుంది. మొదటి సీజన్ ని గెలుపొందిన శివ బాలాజీ పవన్ కళ్యాణ్ తో కాటంరాయుడు అనే సినిమా చేసాడు. రెండో సీజన్ లో గెలిచిన కౌశల్ కి పవన్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టి లో పెట్టుకొని మూడో సీజన్ అందరిలో కెల్లా అషు రెడ్డి కి పవన్ కళ్యాణ్ అభిమానుల సపోర్ట్ ఉందట. ఆ అమ్మాయి కూడా పవన్ అభిమాని కావడం తో ఈ సారి గెలుపు తనదే అనే ప్రచారం సాగుతుంది కానీ అసలు విషయం తేలాలి అంటే ఇంకా చాలా రోజులు వేచి చూడాలి.
