Wednesday, May 7, 2025
- Advertisement -

ఓవర్సీస్ లో కూడా డిజాస్టర్ గా మారిన ‘రణరంగం’

- Advertisement -

ఈ మధ్యనే ‘పడి పడి లేచే మనసు’ అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న యువ హీరో శర్వానంద్ తాజాగా విడుదలైన ‘రణరంగం’ సినిమాతో మరొక ఫెయిల్యూర్ నమోదు చేసుకున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. ఒక పవర్ ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో శర్వానంద్ ఈ సినిమాలో మంచి నటనను కనబరిచాడు. కానీ సినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. మొదటి రోజు నుంచే మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటున్న ఈ చిత్రం త్వరలో డిజాస్టర్ గా మారనుంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక అటు ఓవర్సీస్ లో కూడా తక్కువ కలెక్షన్లను నమోదు చేసుకుంటోంది. ఇప్పటిదాకా అమెరికాలో ‘రణరంగం’ సినిమా కేవలం 79,910 డాలర్లను మాత్రమే వసూలు చేసింది. ‘రణరంగం’ సినిమా ఫ్లాప్ అవడంతో బాక్సాఫీస్ వద్ద ఉన్న మరొక సినిమా ‘ఎవరు’ కి చాలా బాగా హెల్ప్ అయ్యింది. అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటూ వసూళ్ల విషయలో కూడా ముందంజలో ఉంది. వెంకట్ రామ్ జీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -